కరెంటు చిత్రం లోని పాట. విన్నారా మీరు ?
అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తె అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏమి చేస్తున్నా
ప్రతిచోటా నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవులపైన ప్రతీ మాట నువ్వే
అపుడు ఇపుడు ఎపుడైనా నా చిరునవ్వే నీ వలన
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంతా గతమేనా గురుతుకు రాదా క్షణమైనా
ఎదురుగా ఉన్నా నిజమేకాని కలవైనావులే…
రంగు రూపమంటూ లేనేలేనిది ఈ ప్రేమ
చూట్టు సూన్యమున్నా నిన్నే చూపిస్తుంది
దూరం దగ్గరంటు తేడా చూడదీప్రేమ
నీలా చెంత చేరి నన్ను మాట్టాదిస్తోంది
కనుపాపలోతులో దిగి పోయి ఇంతలా
ఒక రెప్ప పాటు కాలమైన మరపెరావుగా
ఎదమారుమూలలో ఒదిగున్న ప్రాణమై
నువ్వులేని నేను లేనే లేను అనిపించావుగా…
అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తె అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏమి చేస్తున్న ప్రతి చోట నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవులపైన ప్రతీ మాట నువ్వే
నాకే తెలియకుండా నాలో నిన్ను ఓదిలావె
నేనే నువ్వయ్యేలా ప్రేమగుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావె..
ఇటుగా చూడనంటు నన్ను ఒంటరి చేసావే
ఏకాంతవేళలో ఏకాంతి లేదురా
నను సంత కూడా జాలిలేని పంతాలేన్టిరా
నీతోడు లేనిదే మనసుండలెదురా
నీ పేరు లేని ప్రేమనైన ఉహించేదెలా
అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తె అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏమి చేస్తున్న ప్రతి చోట నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరపైనా పెదవులపైన ప్రతీ మాట నువ్వే
