పిల్ల కాకి
ఒక చిన్న మొక్క
ఉదయం నా స్నేహితుడు రాకేశ్ తో మాట్లాడుతున్నాను, చెప్పాడు తను an inconvenient truth documentary movie చూసాడంట. కొంచెం ఆలోచన లో పడ్డానుర అని అన్నాడు, ఏమిటి ఆలోచన అని అడిగాను. నాకు నెలకి లక్షన్నర  రూపాయలు జీతం వస్తుంది, అయినా ఏదో తెలియని వెలితిగా ఉండేది ఇన్ని రోజులు , ఈరోజు అర్ధమయింది ఆదేంటొ అని అన్నాడు.
నాకు ఆ డబ్బు అంతా ఉదారంగా దానం ఇవ్వటమే కదా నీకు వచ్చిన ఆలోచన అని అన్నాను. )&^$%*^ అని రెండు సార్లు అని .. ఆ డబ్బు అంతా ఇస్తే ఏమి చేస్తావు అని అన్నాడు. ఏముంది ఇంకా పెళ్లి కూడా కాలేదు, కాని చక్కగా సెటిల్ అవ్వటానికి కావాల్సినవని అన్ని ఇప్పుడే సమకూర్చుకుంటాను అని అన్నాను.
ఎందుకు అవన్నీ అని అన్నాడు?
బాబూ నీకంటే పెళ్ళికాకుండానే వైరాగ్యం వచ్చింది. నాకు అలాంటిది ఏమి లేదు కాబట్టి చక్కగా అన్ని సమకూర్చుకుంటే నేను,నా తరువాతి తరాల వారు హాయిగా ఉండవచ్చు ఆ సౌకర్యాలతో అని రంగుల కల చూపించాను.
ఒకవేళ వాళ్ళకు ఆ సౌకర్యాలు అనుభవించే స్థితి లేకపోతె ఎలా అని అన్నాడు?
ఇదేమో బాబు మోహన్ ప్రశ్న [ఎందుకు ఏమిటి ఎలా లాగా!! ] అని అంటే.. మనం ఇన్ని డబ్బులు సంపాదించటానికి ఎంతో కష్టపడుతున్నాం, ఉరుకులు పరుగులు పెడుతున్నాం, లోన్ తీసుకొనిమరీ కార్లు గట్రా కొని, ఇక కోన్నాము కాబట్టి, ఒక్కోసారి కేవలం చోపించుకొవలి కాబట్టి వాటిని వాడి* ట్రాఫ్ఫిక్ పెరిగిందని చెట్లు నరికి దారులు వెడల్పు చేస్తున్నాం, అవసరం ఉన్నా లేకున్నా వనరులను వృధా చేస్తున్నాము. ఈ విధంగా అన్ని ఇలా ఖాళి చేసేసి, ఆ క్రమం లో పర్యావరణాన్ని కూడా క్రుసించే లాగా చేస్తే మనం సమకూర్చిన సుఖాలు, సౌకర్యాలు ఆస్వాదించే యోగం వాళ్ళకు ఉండదు.
* వాహన వాడకానికి నేను వ్యతిరేకి కాదు.
ఈ రోజుల్లో సంవత్సరానికి 4 తూఫాన్లు వస్తున్నాయి, ఏదో ఒక రకంగా పంటలను బాగుచేసుకుంటున్నాము, 10 రూపాయల బియ్యమును 40 రూపాయలకి కొంటున్నాము.మరి తరువాతి ఏడాదిలో 10 తూఫాన్లు వస్తాయి, ఇంకా వస్తువుల ఖరీదు పెరుగుతుంది, ఎన్ని డబ్బులు అని చాలతాయి అప్పుడు? నాశనమయిన[నాశనమవుతున్న]  పర్యావరణాన్ని బాగు చెయ్యాలంటే ఎంత డబ్బు కావాలి అని అడిగాడు?
చేస్తే money transfer చెయ్యి, లేదా పెళ్లి చేసుకో అంతేగాని నన్ను ఇలా లెక్కలు వెయ్యమని అడగకు, నేనసలే ఆ విభాగం లో కంపార్ట్ మెంటల్ పాస్ గాడిని అని చెప్పి ఇంకొంచెం వాదించుకొని ఫోన్ పెట్టేసాను.
కాని మనసులో మాత్రం తను చెప్పిన దాని గురించే ఆలోచన. ఎంత కాలం సంపాదించిన అనుభవించే పరిస్తితులు లేకపోతె ఏమి ఉపయోగం? నిజమే పర్యావరణం నాశనం అవుతున్నది.చాలా వేగంగా.అవసరం ఉన్నాలేకున్నా వనరులు వాడుకుంటున్నాము. మళ్ళి మళ్ళి దొరకని పెట్రోల్ ని బంగారం లాగా చూసుకున్తున్నాము కాని ఉదారంగా దొరికే గాలి, నీరు, సూర్యరశ్మి లాంటి వనరులు మాత్రం గాలికి వదిలేస్తున్నాము.
ఇంట్లో ఉన్నా, లేకున్నా లైట్ వేలగాల్సిందే, ఫ్యాన్ తిరగాల్సిందే, AC పనిచెయ్యాల్సిందే. ట్రాఫిక్ లైట్ దగ్గర బండి ఇంజిన్ ఆపాలని సగం మంది భావించారు. డబ్బులు మంచినీరు లాగా వాడుతున ఈ రోజుల్లో, మంచి నీళ్ళు కూడా ఆ డబ్బుల తోనే కొనుకుంటున్నాము.
పొలం వెళ్తే కుంట లో నీరు తాగలేని దీనస్థితి ,పురుగుల మందులు, పడే తక్కువ వర్షాలకు కూడా ఎక్కువ దిగుబడి కావలి కాబట్టి వేసిన ఎరువులు ఆ నీరు లో కలిసి ఉంటాయి కాబట్టి.
మొన్న ఎండలు మండి పొతే చమటలు కక్కుకుంటూ , వేడి గాలులు పీలుస్తూ, తొలకరి కోసం ఎదురుచూస్తూ గడిపేసాము. కాని ఎల్లపుడు అలానే ఉంటె ఎండలు ?
తెలుసు కదా సూత్రం : నయం చెయ్యటం కంటే, నివారణ మంచిది.
ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.నా వంతుగా ఒక మొక్క నాటి దానికి రోజు నీరు అందిస్తున్నాను ఈరోజు నుంచి. ఒక్కటి తో మొదలు..
మీ అభిప్రాయం ? సలహా ? సూచన ?
నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు రా ఇచ్చింది?
సమయం: రాత్రి 9.20 . ది: 03-జూన్-2009
ప్రదేశం: కోరమంగల, బెంగుళూరు
నా ఫ్రెండ్: అరేయ్ ! బండి ఆపర !! ఇక్కడే సైడ్ తీసుకొని ఆపు. ఆపూ !!!
నేను: ఎందుకు రా? ఏమయిందని ఇప్పుడు?
నా ఫ్రెండ్: నీ &^%*#$@ , ఏంటి రా ఆ డ్రైవింగ్? ఈరోజు ఇంటికి వెళ్తామా లేదా ? అవతల అసలే ఇండియా x పాకిస్తాన్ మ్యాచ్ మొదలవుతున్నది. నువ్వేమో ఆ టెన్షన్ ఏమి లేకుండా ఇలా బండి తోలితే ఎలా రా నీ *&^#%!@. నేను బస్సు ఎక్కి వెళ్తాను ;లేదంటావా నాకు ఇవ్వు నేను తోలుకొని ఇంటికి వెళతాను,నీకు ఇష్టమయితే కళ్ళుమూసుకొని వెనక కూర్చో లేదా నువ్వు బస్సు లో రా.
నేను: కళ్ళుమూసుకొని వెనక కూర్చుని ఇంటికి వచ్చాను[ము].
పై సంఘటనకు కారణభూతమైన సంఘటనా 3 నెలల క్రితం జరిగింది.
నేను కంపెనీ పని మీద డెట్రాయిట్ వెళ్ళాను. ఇన్ని రోజులు అక్కడే ఉండి మొన్న ఉదయమే వచ్చాను తిరిగి బెంగుళూరు కి. అక్కడ ఉన్నన్ని రోజులు కార్ డ్రైవ్ చేసేవాడిని. ఆఫీస్ కి వేళ్ళటానికొ, లేదా షాపింగ్ కోసమనో డ్రైవింగ్ చెయ్యాల్సి వచ్చింది. అసలే పరాయి దేశం, పైగా ఎడమ వైపు స్టీరింగ్. ఇవన్ని ఒక ఎత్తు అయితే ట్రాఫిక్ రూల్స్ ఇంకొక ఎత్తు. ఇక్కడ మన దెశం లో లాగా కాకుండా ట్రాఫిక్ పోలీసు పని లేకుండానే అందరు చక్కగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంటారు.నేను కూడా పెద్దగా ఇబ్బంది పడకుండానే వాటిని నేర్చుకొని పాటించాను.
కాని మొన్న ఉదయం ఇరిగి ఇండియా వచ్చిన దగ్గరనుంచి నాకు మహా ఇబ్బందిగా ఉంది. డ్రైవింగ్ చెయ్యాలన్నా, డ్రైవ్ చేస్తున్నపుడు వెనుక కూర్చోవాలన్నా.
విమానాశ్రయం నుంచి టాక్సీ లో వస్తున్నపటినుంచి నాతొ వాహనం లో ఉన్న వారందరూ ఒకటే మాట. నేను రూల్స్ అని అన్న ప్రతీసారి – “&^%*#$@ , *&^#%!@ కళ్ళుమూసుకొని కూర్చో, లేదా బస్సు లో ప్రయాణం చెయ్యి.ఇంకొక సారి ఇలాంటి కూతలు కూశావంటె .. ఏమి చేస్తానో నాకే తెలియదు.”
గమనిక: &^%*#$@ , *&^#%!@ అనేవి సభ్య సమాజం తలదించుకునే పదాలు.
లేన్ డిసిప్లెన్, రెడ్ లైట్ పడితే ఆగటం , లేన్ మారేటప్పుడు indicator వెయ్యటం, గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు ఇంజన్ ఆపుచేయ్యటం లాంటి అసాంఘీక కర్యకలాపాలు లో పాటిస్తున్నాను అని మా జనాభా గొడవ. అస్సలు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు రా ఇచ్చింది ? అని చివరకు నా డ్రైవింగ్ లైసెన్స్ మీదనే “నకిలీ” అని స్టాంపు వేశారు.
వీడికి స్వైన్ ఫ్లూ కాదురా డ్రైవ్ ఫ్లూ వచ్చింది అని కొందరు అంటే, నువ్వు ఇలాగె బండి తోలావంటే “ఏ అమ్మాయి రెండవసారి నీ బండి ఎక్కదు” అని స్వయానా మా వదినె నన్ను భయపెడుతున్నది. ఇదే మంచి అవకాశం అని నన్ను ఇంట్లోనే ఒక గదిలో పడేసి తాళం వేద్దామని ఇంకొందరి ప్లాన్. ఈరోజు జరిగిన సంఘటనను తీవ్ర నేరం క్రింద పరిగణించి ముద్దాయినైన నాకు “నా డ్రైవింగ్ లైసెన్స్ ను వెంటనే నవ్వుతూ surrender  చెయ్యవలసింది గా, కాని పక్షాన జప్తు చెయ్యవలసింది గా ” గట్టి శిక్ష విదించారు.” ఏ రూల్ కింద నన్ను ఇలా శిక్షించారు?” అని అడిగితె.. “మళ్ళి రూల్స్ అంటావు రా ??” అని గట్టిగా గర్జించి “నన్ను ఇక ఎప్పటికి బండి తోలనివ్వవద్దు అని”, మరొక మారు అప్పీల్ చెయ్యటానికి కూడా నిరాకరించి కేసును క్లోజ్ చేసారు.
చివరుకు ఇండియా గెలిచిన సుభసంధర్భం లో నాకు కొంత శిక్ష రాయితీ కలిపిస్తూ “ఈ ఆదివారం డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించాల్సింది గా ఏకగ్రీవంగా తీర్పు వెలువడింది”. నేను ఆరోజు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అడిగోడి రోడ్ మీదగా మెజెస్టిక్ కు ఒక గంట లో రావాలి. 30 kmph స్పీడ్ తో ౨౦ సిగ్నల్ లైట్స్ దాటి రావాలి. లేదంటే నా డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ కాపీ ని నా కళ్ళెదుటే సెకండ్ హ్యాండ్ కి ఫోటో మార్చేసి అమ్మేస్తాను అని మా జనాభా కొత్త శాసనసభ లో మొదటి బిల్లు కింద సంతకాలు చేసి పాస్ చేసారు.
పాస్ అయిన బిల్ ప్రతిని జాగ్రత్తగా చూస్తె ఒక్క విషయం అర్ధమయింది అందులో ఎప్పుడు డ్రైవ్ చెయ్యాలి అని ఖచ్చితమైన టైం చెప్పలేదు.!! అందుకే నేను రాత్రి ౧౨.౦౦ కి డ్రైవ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. తప్పదు, మంచి అలవాట్లు మానుకోవటం తప్పుకదా!! ఏమంటారు ?
అడగటం మరిచాను – ఇలాగే డ్రైవ్ ఫ్లూ తో బాధపడుతున్న వారు ఎవరన్న ఉన్నారా?
ఏడుకొండల వాడికి జ్వరం వచ్చింది…
10 సంవస్తరాల తరువాత తిరుమల వెళ్ళాను. అరి కాళ్ళు కాలిపోయేటంత, వళ్ళు అంతా చెమట పట్టేటంత వేడిగా ఉంది. దారి తప్పి వేరే ఊరు రాలేదు కదా అని అనుమానం వచ్చింది. దర్శనం సమయం లో స్వామిని అడిగాను ఏమిటి ఈ వైపరిత్యం అని…
తప్పు చేసి క్షమించమని,పాపాలు చేసి కాపాడమని నాకు లంచం ఇస్తున్నారు ”కానుక” అని చెప్పి. నేను చేసిన అప్పు తీర్చాలి కనుకు కాదనలేక, ఆ మెలిక  పెట్టినా తీసుకుంటున్నాను. మరి ఆ పాపాలన్నీ ప్రక్షాళన చెయ్యగలనో లేదొ అని అనుమానం తో వచ్చిన కొద్దిపాటి జ్వరం వల్లే ఈ వేడి అంతాను అని అన్నారు.
దేవుడైన మీకే జ్వరం వచ్చేలాగా ఉంది మరి ఇక మా వ్యవస్థ సంగతి ఏమిటి స్వామి? అని అన్నాను. ఎలెక్షన్ రోజు 1000/- తీసుకుంటే తరువాత నీ పని జరగటానకి ఒక 1౦౦౦/-, అది సరిగ్గా అయ్యేలాగా చూడమని నాకు ఇంకొక 1000/- ఇచ్చుకోవాలి. అలా కాకుండా మంచి కోసం ఓటు వేసినా గెలవకపోతే “ఇక అంతేలే” అని అనుకున్నా నా జ్వరం ఇలాగె పెరుగుతూ ఉంటుంది. “దేవుడికి చెప్పాను కదా” అని అనుకుంటే నీ పాపం తీరిపోదు, పని జరిగిపోదు. మళ్ళి ఇంకొక సారి అలా చెయ్యవద్దు, చేయ్యనివ్వవద్దు అని అన్నారు.
ఈ విషయం అందరికి చెప్తాను, కాని నమ్మేవాళ్ళు , ఆచరించే వాళ్ళు ఎంత మంది ఉంటారు స్వామీ? అన్నాను. చిన్న నవ్వు నవ్వి,”తిరుమల లో వేడే నీకు కొలమానం, నీకు ఇష్టమైనప్పుడు నన్ను మళ్ళి కేవలం చూడటానికే రా – నీ కష్టమైన మొక్కు తీరిస్తే. పాపం తీర్చమని మాత్రం అడగకు, చాలా మంది వరుసలో ఉన్నారు ఇప్పటికే స్పెషల్ టికెట్ తీసుకొని మరీను !! ” అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళమన్నారు.
గుండు మీద చల్ల గాలి వీచింది.
మీలో ఎవరన్నా తిరుమల వెళ్తే అడగండి స్వామిని ఆరోగ్యం ఎలా ఉందొ. అవునుగాని ఇంతకీ ఈరోజు తిరుమల లో ఉష్ణోగ్రత ఎంత?
నేను తెలుగు వాడిని కాదు అని చెప్పుకోవాలేమో కొంతకాలానికి…
తాగుబోతులు, అజ్ఞానులు, అర్భకులు , దరిద్రులు రాష్ట్రాన్ని సమాధి చెయ్యమని తలా ఒక రూ.1000/- లేదా ఒక పట్టుచీర తీసుకొని వల్లకాట్లో పడేసారు.
కేవలం ఒక్కరు మాత్రమే ఆ సమాధి మీద ఒక తులసి మొక్కను నాటారు.
జయ హో !! జన్మ భూమి
ఆ ఆటో కి డిస్కు బ్రేక్స్ ఉన్నాయి…
నిజం అండి.. ఆటో కి  కూడా డిస్కు బ్రేక్స్ ఉంటాయి…
ఉస్మానియా లోని కమ్యునికేషన్ అండ్ జర్నలిసం కోర్సు లో చేరటం కోసం ప్రవేశ పరీక్ష వ్రాసిన రోజు అది.
పరీక్ష మధ్యానం ౩ గంటలకి. క్యాంపస్ లోని ఆర్ట్స్ కాలేజీ పరిక్షా కేంద్రం. ఉన్నవి 60 సీట్ లు. వచ్చింది మాత్రం 2-3౦౦౦ మంది. అందరు నా లాగే సరదాగా పెళ్లి చూపులకి వచ్చినట్లు లేరు. చాలా సీరియస్ గా ఏవో ఏవో పుస్తకాలు తిరగేస్తున్నారు. నాకేమి అర్ధం కావటం లేదు. అనుమానం వచ్చింది. నేను కరెక్ట్ సెంటర్ కి వచ్చానో లేదో అని. హాల్ టికెట్ రెండు సార్లు చూసుకున్నాను, నా లాగే పెళ్ళిచూపులకి వచ్చిన ఇంకొక ఇద్దరినీ అడిగి కన్ఫామ్ చేసుకున్నాను(ము).
4.30 కి శాతవాహన సూపర్ ఫాస్ట్ బండి ఉంది..అది అందుకోవాలి అని ప్లాన్. పరీక్ష మొదలయ్యింది. కేవలం 100 ప్రశ్నలు. నాకు ఎందుకో అన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుస్తున్నాయి. మళ్ళి అనుమానం వచ్చింది. ఈసారి పక్కన ఉన్నవాళ్ళని ఎవ్వరిని అడగటానికి కుదరదు.. హాల్ టికెట్ మళ్ళి చూసుకున్నాను. నేను వచ్చింది కరెక్ట్ ఎక్షామ్ కే. సెంటర్ కి వచ్చేటప్పుడు నేను బస్ లో కండక్టరు కాలు తొక్కిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ కండక్టరు కి చెక్కిన పెన్సిల్ ములికి ని బలి ఇచ్చి, మళ్ళి పెన్సిల్ చెక్కుకొని 35 నిముషాలలో అన్ని ప్రశ్నల రింగులకి నల్ల రంగు దిద్ది ,ఓ 20 రాని వాటిని ఒక సారి మళ్ళి కండక్టరు కాలు తొక్కినట్లు గా ఫీల్ అయ్యి నాకు కరెక్ట్ అని అనిపించిన ఆన్సర్ ని ఇంకా ఎక్కువ నల్లగా దిద్దేసాను. ఈ ఎక్ష్ట్రా ఎఫ్ఫర్ట్ కు 5 నిముషాలు పట్టింది.
టింగ్ టోంగ్ టింగ్ … సమయం మధ్యానం 3.40 :
అప్పటికే కండక్టరు కాలు ని తొక్కిన లక్ లో ఉన్న అభ్యర్ది సంజీవ్ కొత్త పెన్సిల్ ని 10 సార్లు చెక్కి పూర్తిగా వాడేసి వేగంగా అన్ని ప్రశ్నలతో నల్ల రంగు హొలీ ఆడుకున్న టైం అది.
పరీక్ష పూర్తి అయ్యింది[నా వరకు] , ఇక నా ఆలోచనలు అంతా శాతవాహన సూపర్ ఫాస్ట్ బండి ని మెగా ఫాస్ట్ గా వెళ్లి అందుకోవాలని. అటెన్షన్ లో లేచి నిలబడ్డాను, “మ్యాడం” అని పిలిచాను. అందరు నా వైపు వింతగా చూశారు. నాకు అర్ధం కాలేదు, చెమటలు పడుతున్నాయి, వెంటనే తన చెమట తుడుచుకుంటూ ఇన్విజిలెటర్ మ్యాడం చెప్పింది “ఈ రూమ్ లో ఫ్యాన్ సౌకర్యం లేదమ్మ” అని .. నేను అది కాదు మ్యాడం అని మళ్ళి అంతే నిలబడ్డాను.. మళ్ళి అందరి చూపులు నా వైపే..
ఇంతలోకి అక్కడికి వచ్చిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఏమి జరుగుతుంది ఇక్కడ నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి అనే చూపులు చూశాడు నా వైపు… నేను “పేపర్ సర్” అని అన్నాను.. ఏమయ్యా నీకు అసలు ఎమన్నా జనరల్ నాలెడ్జి ఉందా ఈ ఎంట్రన్స్ ఎక్షామ్ కి ఎవరన్నా ఎక్ష్ట్రా ఆన్సర్  పేపర్ ఇస్తారా ? అని ఒక  జనరల్ నాలెడ్జి లేని ప్రశ్న వేసాడు.. నేను ఈ షాక్ లో నుంచి తేరుకొని అది కాదు సర్.. “నా ఎక్షామ్ పూర్తి అయ్యింది పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోతాను” అని చెప్పాను. మళ్ళి అందరు నా వైపు చూశారు… కాని ఈ సారి ఇద్దరి చూపుల్లో మాత్రం ఎనలేని స్నేహబంధం కనిపించింది. ఆ ఇద్దరు నేను ఎక్షామ్ మొదట్లో హాల్ టికెట్ చెక్ చేసుకున్న తత్కాల్ మిత్ర బృందం లోని రిజర్వేడ్ సభ్యులు.
ముందు “కా”దు “కు”దరదు అని “క” గుణింతం చెప్పిన మ్యాడం 5 నిముషాల తరువాత మళ్ళి “క” గుణింతమే చెప్పిన ఈసారి “ఓ” పదం చేర్చి “ఒకే” గా మార్చివేసింది.
నేను జీవిత ఖైదు పడి జైలు నుంచి పారిపోతున్న ఖైది లాగా పరుగో పరుగు, బస్ స్టాప్ కి , తార్నాక మీదగా సికంద్రాబాద్ వెళ్ళాలని. బస్ రావటం లేదు , ఒక మంచి మనిషి నాకు తార్నాక వరకు లిఫ్ట్ ఇస్తే ఇక మన RTC ని నమ్ముకొని మళ్ళి కండక్టరు కాలు తొక్కుదామని ప్రయత్నించి విఫలమై రూ.4/- ఇచ్చి సికంద్రాబాద్ స్టేషన్ చేరుకునే సరికి…
“టింగ్ టోంగ్ టింగ్ సికంద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళవలసిన శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్ష్ప్రెస్స్ ప్లాట్ఫారం 1 నుండి బయలు దేరుటకు సిద్దముగా ఉన్నది” అని మైక్-వాణి వినిపించింది.
టికెట్ లైన్ చూస్తె వరద బాదితులకు పులిహోర పొట్లాలు పంపిణి చేసే సహాయ కేంద్రం లాగా ఉంది. తప్పని పరిస్థితులలో టికెట్ లేని ప్రయాణం చేద్దామని బాగా రద్దీగా ఉన్న బోగి లోకి ఎక్కాను. ట్రైన్ కదులుతున్నది మెల్ల మెల్లగా.. కాని మైక్-వాణి మాత్రం ఇంకా “ప్లాట్ఫారం 1 నుండి బయలు దేరుటకు సిద్దముగా ఉన్నది” అనే వాణిస్తున్నది.
నా సాహస గాధను నా తోటి వాడికి చెప్పాను, తను కూడా నా లాంటి సాహసికుడే అని తెలిసింది. ఇంజన్ వెనుక ఉన్న సింగిల్ బోగి లోకి TC గారు రారు అని నాకు భరోసా ఇచ్చి కదులుతున్న ట్రైన్ లో నుంచి జంప్ కొట్టి ఆ సింగిల్ బోగి లోకి ఎక్కించాడు. మొదటి సారి ఇలా సాహసం చేస్తున్నాను అని చెప్పాను, కాజిపేట లో టికెట్ తీసుకుంటాను అని కూడా చెప్పాను. అతను నవ్వి “ఎందుకు అనవసరంగా!!.. TC రాడు నువ్వు హాయిగా ఉండు” అని నాకు ఒక చిన్న టికెటొపదేశం చేశాడు. తను ఇలా చాలా సార్లు ప్రయాణించాను అని కూడా చెప్పేసరికి నాకు ఎవేరేస్ట్ శిఖరం ప్యారగాన్ చెప్పులతో ఎక్కేద్దాము అనేంత ధైర్యం వచ్చింది.
చిన్న ఫ్లాష్ బ్యాక్:
సమయం – క్రిందటి రోజు రా. 11.30. నేను అప్పుడే దిల్షుక్ నగర్ లో ఉన్న వెంకటాద్రి థియేటర్ లో “హమ్-తుమ్” రెండవ ఆట చూసి ఫ్రెండ్ రూమ్ కి వచ్చాను. జేబులో ఉన్నవి రూ.100/-. సినిమా కి 20/- అయిపోయాయి. ఇక తెల్లవారి మధ్యానం ఉస్మానియా క్యాంపస్ లోని ఆర్ట్స్ కాలేజీ కి రావటానికి 4/- , అక్కడి నుంచి సికంద్రాబాద్ కు ఇంకొక 4/-. సికంద్రాబాద్ నుంచి 75 రూపాయలు ఉంటే ఖమ్మం ఛలో. కాని జేబులో 72 మాత్రమె ఉన్నాయి. టికెట్ కి సరిపోవు. అందుకే ప్లాన్ లో ప్లాన్ లాగా సాహసానికి ఒడిగట్టాను. ఇంతటి తో చిన్న ఫ్లాష్ బ్యాక్ సమాప్తం.
ట్రైన్ దారి కాజిపేట -> వరంగల్ -> ఖమ్మం -> విజయవాడ. కాజిపేట వరకు సూపర్ ఫాస్ట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ లాగా వచ్చింది. నేను కూడా నా ఫ్లాష్ బ్యాక్ లో నుంచి బయటకు వచ్చి ట్రైన్ స్పీడ్ ని 90 KMPH అని నిర్ధారించి, కాజిపేట స్టేషన్ లో ఆగినప్పుడు టికెట్ కూడా తీసుకోకుండా ఇంజన్ లోని డ్రైవర్ ఎవరో చూసి అతనికి ఎవేరేస్ట్ శిఖరం కి వెళ్ళే రూట్ ఎమన్నా తెలుసేమో కనుక్కుందామని వెళ్ళాను…[దీనినే ఇంగ్లీష్ లో "ఎక్ష్టాలు" అని అంటారు]
ఇంతలొ మైక్-వాణి మళ్ళి వినిపించింది. “మన బోగి” లోకి ఎక్కి డోర్ దగ్గర నిలబడి స్టేషన్ లో ఉన్న వారికి టాటా చెప్తున్న వారికి “మ్యానర్స్ లేదు” అని అనుకోని  లోపలికి 2 అడుగులు వేసాను. ట్రైన్ వరంగల్ వైపు మెల్లిగా వెళ్తున్నది. ఇంతలొ నాకు టికెటొపదేశం కృష్ణుడు వచ్చి “ఛా!! TC ఎక్కాడు” అని ఎవేరేస్ట్ మీద ఉన్న మంచు అంతా కరిగేంత హాట్ న్యూస్ చెప్పాడు. మంచు ఇంకా కరగటం కూడా మొదలు అవ్వలేదు ఇంతలోనే TC నిప్పు నాగరాజు వచ్చి నా ఫేస్ చూసి తన పంట పండింది అని డిసైడ్ అయ్యి టికెట్ చూపించు అని ఒక చిన్న నిర్ధారణ ప్రశ్న వేసాడు. నేను లేదు అని చెప్పి, ఎందుకు తీసుకోలేదో కూడా చెప్పాను. నిప్పు నాగరాజు ఈసారి ఇంకా పెద్ద స్మైల్ ఇచ్చాడు.
సమయం: తెలియదు;  ప్రదేశం:మంచు మొత్తం కరిగిపోయిన ఎవేరేస్ట్ శిఖరం
కట్ చేస్తే…
సమయం: సంకట సమయం;
ప్రదేశం: నేను బుల్లెట్ ట్రైన్ అని ఫీల్ అయిన ట్రైన్ కజిపేట్ నుంచి వరంగల్ మధ్యన ఉన్న 10 కి.మీ దూరం ని పూర్తి చెయ్యటానికి 20 నిముషాలు అయిన ఇంకా వరంగల్ చేరకుండా మధ్యలో ఆగిన ప్రదేశం.
కట్ చెయ్యక ముందు:
నేను: సర్, నేను నిజంగా చాలా ప్రయత్నించాను సర్. కాని ట్రైన్ కదులుతూ ఉండేసరికి తరువాత స్టేషన్ లో తప్పకుండా టికెట్ తీసుకుందామని ఎక్కేసాను సర్.
నిప్పు నాగరాజు: ఎ స్టేషన్ లో ఎక్కావు ట్రైన్ ? ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ?
నేను: వరంగల్ స్టేషన్ లో సర్ . ఖమ్మం వెళ్ళాలి
నిప్పు నాగరాజు: నిజంగా ? అబద్దం చెప్ప వద్దు.
నేను: నిజం సర్. కావాలంటే చూడండి నా దగ్గర సరిగ్గా రూ.70/- ఉన్నాయి సర్.
నిప్పు నాగరాజు: సరే అయితే, నువ్వు కొంచం పక్కకు నిలబడు, ఇంకా కొంతమంది ఎవేరేస్ట్ ఎక్కే వాళ్ళు ఉన్నారు, వాళ్ల సంగతి చూసి నీ దగ్గరకు వస్తాను అని చిన్న బ్రేక్ ఇచ్చాడు నాకు.
బ్రేక్ పూర్తి అయ్యింది అన్నట్లు ట్రైన్ ఇంజన్ హారన్ మొగి చిన్నగా మళ్ళి కదలటం మొదలయ్యింది.  మళ్ళి వచ్చి అదే చిరునవ్వు తో నన్ను అదే ప్రశ్న అడిగారు TC గారు. లాస్ట్ ఛాన్స్ అమ్మ నీకు.. ఈసారి నిజం చెప్పు .. ఆ రూ.70/- తో వదిలేస్తాను అని అన్నారు.
నిజం సర్ అని నేను తడబడుతూ అంటుండగానే బయట నుంచి మైక్-వాణి వినిపించింది. “వరంగల్ స్టేషన్ మీకు స్వాగతం పలుకుతున్నది” అని. ఈసారి స్మైల్ నేను ఇచ్చి “సారీ సర్, చిన్న కంఫ్యూజన్, కజిపేట్ లో ఎక్కాను, వరంగల్ లో టికెట్ తీసుకుందామని” అని మళ్ళి చెప్పాను.
“70 కాదు హీరో 500 కట్టు” అన్నాడు. ఆయన వెనుక ఉన్న నా కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వుతో అలానే చూస్తున్నాడు నా వైపు. సర్, కావాలంటే జేబులో ఒక దువ్వెన ఉంది,తీసుకోండి అంతే ఇంకేమి లేవు సర్ అని గట్టిగా చెప్పాను. మళ్ళి ఒక పెద్ద తప్పు… ఆయనకు బట్ట తల…
రెండు నిముషాలు  నా వైపు కోపం గా చూసి ఇంకొక సారి ఇలా చేశావనుకొ ఒదిలి పెట్టేది లేదు అని నా 70 + కృష్ణుడి 50 తీసుకొని 120/- ఒకే సింగిల్ టికెట్ కొట్టి వెళ్ళిపోయాడు.
కామ్ గా కూర్చున్న నన్ను మళ్ళి కృష్ణుడు కదిలించి ఏంటి బ్రదర్ అది.. ఎందుకు 70 ఇచ్చావు. నేను చూడు విజయవాడ వరకు వెళ్తున్నా ఇదే ట్రైన్ లో.. కానీ 50 మాత్రమె ఇచ్చాను!!  అయినా అలా తడబడితె ఎలా? కూల్ గా ఉండాలి అని అన్నాడు. నాకు కూల్ అని అనగానే మళ్ళి ఎవేరేస్ట్ గుర్తుకువచ్చింది. కాని చేసిన నిర్వాకం చాలు అని అనుకోని ఇక, ఏమి మాట్లాడలేదు. తను మాత్రం   ఏదో చెప్తూనే ఉన్నాడు.
ట్రైన్ మళ్ళి బుల్లెట్ లాగా వెళ్తున్నది. ఖమ్మం లో దిగిన తరువాత ఇంకొక పెద్ద సమస్య వచ్చింది. మా ఇంటికి వెళ్ళాలంటే ఆటో లోనే వెళ్ళాలి. కొంచెం దూరం ఎక్కువ. జేబులో చూస్తె హాల్ టికెట్ ,సిటీ బస్ టికెట్, 2 రూపాయల బిళ్ళ మాత్రమె ఉన్నాయి. ఆటో వాడికి 4 రూపాయలు ఇవ్వాలి. ఎలా ఎలా అని ఆలోచిస్తుండగా, నా స్కూల్ ఫ్రెండ్ ఒకడు కనిపించాడు. ఎడారి లో ఒయాసిస్ లాగా వాడిని చూడగానే ఒలంపిక్స లో రన్నింగ్ రేస్ లాగా ఉరుక్కుంటూ వెళ్లి వాడికి హాయ్ చెప్పి, మామ చిన్న హెల్ప్ కావాలి రా, 2 రూపాయలు ఉన్నాయా? అని అడిగాను. వాడు అదోలాగా చూసి, “లేవు రా.. ఒక్క రూపాయే ఉంది” అని అది నా చేతిలో పెట్టి అర్జెంటు పని ఉంది రా అని చెప్పి వెళ్ళిపోయాడు.
“చచ్చినవాడికి పెళ్ళికి వచ్చిందే కట్నం” అని సామెత గుర్తుచేసుకొని ఆటో ఎక్కి డ్రైవర్ పక్క కూర్చుని వెళ్తున్నాను. నాదే లాస్ట్ స్టాప్. అందరు దిగి నేను ఒక్కడినే మిగిలాను. కొంచెం దూరం వెళ్ళిన తరువాత నోటి దూల ఆగక.. “అన్నా 3 రూపాయలే ఉంటే ఎక్కడి వరకు దించుతావు?” అని అడిగాను. ఆటో అన్నయ్య వెంటనే బ్రేక్ వేసి “ఇక్కడి వరకే దించుతాను తమ్ముడు” అని ఆటో ఆపేశాడు. ఆ ఆటో బ్రేక్ లు పాడుగాను డిస్కు బ్రేక్స్ అనుకుంటా.. వేసిన చోటే ఆగిపోయింది ఆటో. 3 రూపాయలు ఇచ్చేసి ఇంటికి 1 కి.మీ నడుచుకుంటూ వెళ్ళాను.
నాన్న కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకొని వెళ్ళరా అని చెప్పిన వినకుండా వెళ్ళినందుకు నాకు ఉచిత కాల్పనిక ఎవేరేస్ట్ దర్సనం, రూపాయి విలువ తెలిసి వచ్చింది.
ఆ ఎక్షామ్ లొ నాకు 30 వ ర్యాంక్ వచ్చింది.
‘వెంకి’ సినిమా లొ TC పాత్ర వేసిన వేణు మాధవ్ పేరు కూడా ‘నిప్పు నాగరాజు’ అవ్వటం నాకు బలే అనిపించింది.
ఈ నంబరు తాత్కాలికముగా పనిచెయ్యటం లేదు – భాగం 2
మొదటి భాగం కోసం ఇక్కడ చూడండి
కాలేజీ రోజులు అలా సరదాగా గడిపిన తరువాత ఫోన్ వల్ల అసలు ఉపయోగం ఏమిటో తెలిసింది. స్నేహితుల ఫోన్ నంబర్లు సంపాదించి ఉన్న కొద్ది పాటి టాక్ టైం ను చాలా జాగ్రత్తగా వాడుకునేవాడిని. రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉద్యోగం. నా జాతకం తో కూడిన ఉద్యోగ అబ్యర్దన పత్రం ఒకటి తయ్యారు చేసి హైదరాబాద్ మహానగరం లో రూ.500/- ఒక బస్ పాస్ తీసుకొని రోజు ‘నగరం లో నేటి విశేషాలు’ అనే ప్రోగ్రాం కి నా వంతు సహకారం అందించేవాడిని. ఉద్యోగం ఇస్తాము అని ఎవరో అమ్మాయి శ్రావ్యంగా ఫోన్ చెయ్యటం,ఎ అమెరికానో వెళ్ళాలంటే ౩ గంటలు ముందే ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నట్టు ఉదయాన్నే దిల్షుక్ నగర్ నుంచి [ఒక 10 రెసుమే లు పట్టుకొని ] బయలుదేరి ఆ అడ్రెస్స్ సరిగ్గా వెతికి పట్టుకోవటానికి ఒక 10 ఫోన్ కాల్స్ చేసీ చేసీ చివరికి వెళ్లి కలిస్తే , వాడు “ఈరోజు శుక్రుడు, బుధుడు శని ని వదిలేసి సూర్యుడి తో కలిసి పిక్ నిక్ కి వెళ్లారు, కనుక నువ్వు రేపు ఉదయం రా , ఇంటర్వ్యూ చేసి తీసుకుంటాము”[ఆల్రెడీ కత్తి లాంటి వాళ్ళని మేనేజర్ సెలెక్ట్ చేసుకున్నాడు.ఇక పనికిరాని శని గాళ్ళు మీరు మిగిలారు] అని పంపించేసేవాడు.  వెదవ గాడిద గాడు, ఆ ముక్క ఫోన్ లోనే చెప్పవచ్చు కదా, సమయం వృధా చేసి హైదరాబాద్ ఎండాకాలం లో మాకు పట్టపగలు నక్షత్రాలు అన్ని చూపించేవాడు. ఎలాగు వెళ్ళాము కదా అని ఆ ఫోన్ చేసిన అమ్మాయిని కలిసి ఒక “హాయ్” చెప్పి వచ్చేవాడిని. రాను రాను బ్యాలన్స్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి. ఎవరికైనా సరే మిస్ కాల్ ఇవ్వటం మాత్రమే లేదా వాచ్ చూసుకుంటూ మాట్లాడటం, 55 సెకండ్స్ అయిన దగ్గరి నుంచి.. ఇక నేను ఉంటాను.. బాయ్ బాయ్ అని టక్కున పెట్టేసేది.జీతం లేదు, ఉద్యోగం లేదు, కేవలం ఉద్యోగం కోసం తిరగటం , ఫోన్ లో బ్యాలన్స్ అవ్వగోట్టటం.
నేను చదివింది ఆర్గానిక్ కెమిస్ట్రీ లో మాస్టర్స్. కెమికల్ ఫ్యాక్టరీస్ లో నా వల్ల కాదు అని డిసైడ్ అయ్యి నా స్నేహితుడు రాకేశ్ సహాయం తో సొంతంగా ఒక లాంగ్వేజ్ నేర్చుకొని,డిగ్రీ చదివే రోజుల్లో నేర్చుకున్న మల్టిమీడియా సహాయం తో ఒక చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ లో జీతం ఇవ్వం అని చెప్పినా సరే అని చేరిపోయాను. పని చేశాను, నేర్చుకున్నాను, సహాయ పడ్డాను. అలా తిప్పలు పడి చివరికి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యాను. ఇప్పుడు మంచి జీతం ఇచ్చె కంపెనీ లో సీనియర్ ఇంజనీర్. ఈ ప్రయాణం మొత్తం లో కూడా నాకు ఫోన్ ఎంత సహాయ పడిందో అంత కంటే ఎక్కువ ఇబ్బంది పెట్టింది.
జీతం లేని రోజుల్లో బ్యాలన్స్ తక్కువ ఉండటం, అందరికి ఫోన్ చెయ్యలేకుండా చేసింది. ఇప్పుడు ఉద్యోగం, పెద్దగా జీతం సంపాదించిన తరువాత ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీసు లోనే సరిపోతున్నది. ఇంటికి కూడా ఎలా ఉన్నారు అని అడగటానికి ఏ అర్ధరాత్రో చేస్తే ఇంత సేపు ఏమి చేస్తున్నావురా నిద్రపోకుండా అని కాలుష్యం తో నిండి పోయిన బెంగుళూరు ఆకాశం లో కూడా స్పష్టంగా అన్ని రాశులలో ఉన్న నక్షత్రాలు లేక్కపెట్టించే వారు.
బందువులు:
నా చిన్నప్పుడు పండుగకి, లేదా శుభకార్యానికి బందువులు అందరం కలుసుకునే వాళ్ళం. చిన్న చిన్న అత్త, పెద్ద పెద్ద అత్త, పక్కింటి బాబాయ్, ఎదురింటి పెద్దనాన్న ఇలా చాన్తాడంత మంది ఉన్నారు. పండుగకి ఏడాదికి 2 - 3 సార్లు వెళ్తాము కాబట్టి మాట్లాడుకోవటానికి చాలా కబుర్లు ఉంటాయి. ఇప్పుడేమో ఫోన్ లు వచ్చాయి. పండుగ వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే అప్పుడే మాట్లాడుకోవచ్చు. కాని ఇబ్బంది అంతా ఒక్కటే. చెయ్యవలసిన ఫోన్ నంబర్స్ ఎక్కువగా ఉన్నాయి. మాట్లాడుకునె మాటలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. “బాగున్నాను, మీరు ఎలా ఉనారు, ఏమి చేస్తునారు, ఆరోగ్యం బాగుందా.. ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను”. ఇదీ వరస. మనం ఏదో పని లో ఉండి ఇంటికి కూడా సరిగ్గా ఫోన్ చెయ్యము. అలా అలా అందరికి చేసే ఫోన్లు కూడా తగ్గిపోతాయి. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమిటి రా “మమ్మల్ని మర్చిపోయావా?.. కనీసం ఒక్క ఫోన్ కూడా చెయ్యనే లేదు” అని నిలదీస్తే.. బిజీ గా ఉన్నాను బాబాయ్.. ఈసారి తప్పకుండ చేస్తాను అని చెప్తాము.
మళ్ళి ఆఫీసు కి వెళ్ళిన తరువాత మేనేజర్ ఇంట్లో గడవ పెట్టుకొని వచ్చి ఆ కోపం అంత మన మీద చూపిస్తాడు. పని లో పడతాము. ఒక పక్షం రోజులు గడుస్తాయి , బాబాయ్ కి ఫోన్ చేస్తాము, “ఏంటి రా ఇన్ని రోజులకి గుర్తుకు వచ్చామా మేము” అని ఫోన్ ఎత్తిన వెంటనే అనే మాట, “అలా ఏమి లేదు బాబాయ్, బాగా పని ఉండి చెయ్యలేదు” అని సర్దుకొని మాట్లాడుతాము. మళ్ళి మేనేజర్ మొగుడు ఏదో గొడవ చేస్తాడు ఆఫీసు లో, ఇక చచ్చిందే గొర్రె. ఈ సారి మళ్ళి ఇంటికి తో పాటు బాబాయ్ కి చేస్తాము. మళ్ళి అదే మాట వినిపిస్తుంది. ఏదో మూలన ఉన్న సహనం కూడా పోతుంది.. అసలే మేనేజర్ మొగుడి తో గొడవ, పైగా ఇలా మాటలు అంటే, ఇక ఇంకొక సారి ఫోన్ చెయ్యాలి అన్న ఆలోచన కూడా మెల్ల మెల్లగా పోతుంది.. అలా అని ప్రేమ లేదని కాదు.మనస్సులో ప్రేమ , ఇష్టం ఉన్నా ఆ నిముషం లో అలా అనిపించి ఇక ఒక రకమైన నిర్లిప్తత వచ్చేస్తుంది. ఫోన్ బిల్ మాత్రం వేలల్లో ఉంటుంది , కాని ఎవరితోనూ సరిగ్గా సంబందాలు ఉండవు.
ఫ్రెండ్స్ :
కాలేజీ లైఫ్ లొ, స్కూల్ లైఫ్ లొ ఉన్న తీరిక ఆఫీసు లైఫ్ లొ ఉండటం లేదు. ఈ ఆర్ధిక మాంద్యం వచ్చిన దగ్గరి నుంచి ఎవరి ఉద్యోగం వారికి ముఖ్యమయింది. ఫ్రెండ్స్ తో ఎక్కువ శాతం చాట్ చేస్తాము. ఫోన్ కూడా చెయ్యటం తగ్గిపోతున్నది. ఇక అవసరం వస్తే తప్ప ఫోన్ చేసే పరిస్థితి రావటం లేదు. అలా అని స్నేహం పోయింది అని కాదు, కాని మాట్లాడే సందర్భాలు తగ్గిపోతున్నాయి. అలా ఉండి ఉండి ఒక రోజు ఎవరికన్నా ఫోన్ చేస్తే.. ఫ్రెండ్ నోట్లోనుంచి వచ్చే మాట పైన మన బాబాయ్ నోట్లో నుంచి వచ్చే మాట ఇంచు మించు ఒకటే అవుతున్నది. “ఎంటిరా ఇన్నిరోజులకి ,, నాతో అవసరం వస్తే తప్ప ఫోన్ చెయ్యవా నువ్వు ?” అని అంటాడు. సరే రా నేనంటె వెధవని .. మరి నువ్వైనా కాల్ చెయ్యవచ్చు కదరా అని అనాలనిపిస్తుంది. కాని ఆ నిముషం లొ అది అనవసరపు సంభాషణ అని అనిపించి.. ఒక పెద్ద చిరునవ్వు, ఒక సారీ, మళ్ళి ఫోన్ చేస్తాను మామ అని ఒక మాట చెప్పి బాధతో ఫోన్ పెట్టేయాల్సి వస్తుంది.
ఇక అన్నీటికన్నా దరిద్రం- మన ఫోన్ పోవటమో, లేదా సిమ్ కార్డ్ పాడవటమో జరిగి అందులో ఉన్న మన బాహ్య ప్రపంచపు సంబందాలు చేరిగిపోతే ఇక ఉంటుంది నా సామి రంగా.. కూడలి జాతర జరుగుతుంది ఫోన్ వచ్చిన ప్రతిసారి. ఆ నెంబర్ మనకి తెలుసు , కాని ఆ వ్యక్తీ పేరు మాత్రం గుర్తుకు రాదు. “కౌన్ బనేగా కరోడ్ పతి” లొ కోటి రూపాయల ప్రశ్న కి సమాధానం చెప్పే వాడికి కూడా అంత టెన్షన్ ఉండదేమో ఆ కాల్ ఎత్తాలంటే. ఎత్తి హలో అంటాము , “హలో ఎంటిరా డాష్ గా!! డాష్ డాష్ డాష్… “[గమనిక: డాష్ లొ చాలా బూతులు నింపవచ్చు;చిన్నప్పుడు బిట్స్ పేపర్ లొ వచ్చే ఖాళీలను పూరించుము లాంటిది అనమాట. లేదా అన్ని బూతులని కలిపి ఒక సింగిల్ ప్యాకేజీ లొ ఇస్తే దానినే డాష్ అని అంటారు కొన్ని ప్రాంతాలలో] అలా డాష్ పురాణం లోని కొన్ని పర్వాలను విన్న తరువాత ఆ ఫోన్ చేసిన వ్యక్తీ ఎవరో తెలుస్తుంది. “ఫోన్ పోయింది మామ, అందుకే నీ నెంబర్ గుర్తు పట్టలేదు అని అంటాము” అలా గుర్తులేనందుకు మళ్ళి కొన్ని పురాణాలు , పర్వాలు అనిపించుకొని చివరికి వాడికి ఒక శాంతి పూజ చేసి నెంబర్ సేవ్ చేసుకొని , మళ్ళి ఇలాంటి ఘట్టం కోసం అయిష్టంగా తప్పక  ఎదురుచూస్తూ గడిపేస్తాను.
బ్యాంకు లోన్:
“గుడ్ మార్నింగ్ సర్, నా పేరు రీటా , నేను బొంగు బొషానం బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాను. మేము ఫ్రీ క్రెడిట్ కార్డు ఇస్తున్నాము సర్. మీకు ఒకటి కావాలా? మేము ఫ్రీ గా లోన్ ఇస్తున్నాము, మీరు తీసుకుంటారా?” అని మన పేరు ఊరు తెలియక పోయినా, బ్యాంకు లొ డబ్బు మొత్తం మనదే అన్నట్లుగా మాట్లాడుతుంది. వద్దు మ్యాడం అని చెప్పిన వినకుండా ప్లీజ్ సర్, ప్లీజ్ .. ఫ్రీ ఆఫర్ సర్ అని వదలదు . ఇక చిరాకు తలకు బాగా ఎక్కి “ఒసేయి రీటా .. కాదు కాకి రెట్ట .. వద్దు అంటున్నాను కదా .. నన్ను ఒదిలేయి,.ఇంకొక సారి కాల్ చేస్తే చంపేస్తా” అని ఫోన్ లోనే వీర రేంజ్ లొ వార్నింగ్ ఇస్తాను, అంతా విని కూడా సర్, ప్లీజ్ సర్ అని మళ్ళి అంటుంది. ఇక జాలి వేసి.. మ్యాడం ప్లీజ్ మ్యాడం .. మీకు మీ టార్గెట్స్ మీకు ఉంటాయి, కాని నా వల్ల కాదు , నన్ను ఒదిలెయ్యండి అని బ్రతిమలాడాల్సి వస్తుంది. ఆయినా వదలకుండా.. సరే సర్, మీ ఫ్రెండ్ ఎవరిదైనా నెంబర్ ఇవ్వండి, రెఫెరెన్సు అని అంటుంది. నన్ను డాష్ అని తిట్టిన నా ఫ్రెండ్స్ వి,పనిలో పనిగా మా మేనేజర్ నెంబర్ కూడా ఇస్తాను కసిగా. నా పేరు ఎలాగు తెలియదు కదా తనకి.. ఎవ్వరు రెఫెరెన్సు ఇచ్చారో చెప్పటానికి!!
ఇక ఒక్కోసారి ఈ బ్రతిమలాడే ఓపిక లేని నా ఫ్రెండ్ ఒకడు, ఎవరన్నా అమ్మాయి [ఎక్కువగా అమ్మాయిలే చేస్తూ ఉంటారు] కాల్ చేస్తే , మీకు పెళ్లి అయిందా ?,మీ వయస్సు ఎంత ?,  పిల్లలు ఎంత మంది?,మీ లాగా కాకుండా నాకు ఎమన్నా మంచి సంబంధం ఉంటే చూస్తారా అని అడ్డమైన తిక్క చెత్త ప్రశ్నలు అడిగి ఆ అమ్మాయితో కూడా ఒక డాష్ అని అనిపించుకొని ఫోన్ పెట్టేస్తాడు. డాష్ అంటే అన్నది కాని, ఇంకొక సారి మాత్రం ఫోన్ రాదు.. గ్యారంటి. [వస్తే మీరు ఇంకా పెద్ద డాష్ అని అర్ధం..;) ]
ప్రేమికులు :
ఈ బాధలు ఒక ఎత్తు అయితే , గర్ల్ ఫ్రెండ్స్ లేదా బాయ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ పరిస్తితి అంతా ఇంతా దయనీయం కాదు. నా ఫ్రెండ్ కి ఒక లవర్[గర్ల్ ఫ్రెండ్] .. సరదాగా చెప్పాలంటే పెళ్లి చేస్కుంటే ఆ అమ్మాయి ఎంత కట్నం* ఇస్తుందో తెలియదు కాని.. వీడి ఫోన్ బిల్ మాత్రం వేలల్లోకి వెళ్తుంది రోజూ. ఈమధ్యే ఆ అమ్మాయికి కూడా ఉద్యోగం వచ్చింది. బిల్ సరిసమానంగా పంచుకుంటున్నారు. ఈరోజుల్లో మా అబ్బాయిలకి కొంచెం అభద్రతా భావం అనే ఒక పిశాచి పూనింది. కొంత మంది అమ్మాయిలు కూడా ఉన్నారనుకోండి ఈ విభాగం లొ పోటి చెయ్యటానికి;  చుట్టూ చూస్తున్న మా యువత సమాజం లో కొన్ని అంశాల వల్లో, లేదా నిజంగానే ఉన్న కొంచెం అనుమానం వల్లో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేని ప్రేమ ఏర్పడుతున్నది. అది గట్టి పడాలంటే 24 గంటలు ఫోన్ లొ మాట్లాడాలి. ఎవరు ఏమి చేస్తున్నారో అనుక్షణం తెలుసు కోవాలి. మొదట్లో ఏమి ఉండక పొవచ్చు, కాని రాను రాను కొంచెం మోతాదులు ఎక్కువై, గొడవలు, ఫోన్ నేలకేసి కొట్టటాలు, కాల్ చేసినప్పుడు సమాధానం చెప్పకపోతే 10 - 20  SMS లు పంపటాలు, ఇలా ఇలా కొంచెం టెన్షన్ తో ఉన్న లైఫ్ లోకి ఇంకా టెన్షన్ ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. చివరికి ఏమవుతుంది రా అంటే..  మళ్ళి సంబందాలు చెడిపోతున్నాయి. కాలర్ ట్యూన్ మారుతుంది “ఎవడే ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం…. ” అని. పరిస్థితి మరీ హృదయవిదారకంగా ["బ్యాడ్ గా"  ] ఉంటే  “నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా …” అని మారుతుంది వెంటనే.
ముగింపు :
అందరి సంగతి నేను ఇక్కడ చెప్పటం లేదు, కాని చాలా వరకు ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు అని అనిపించింది నాకు. ఫోన్ లేని జీవితం చాలా హాయిగా ఉంటుంది అని అనిపిస్తున్నది.చిన్నప్పుడు నేను పడ్డ “పిల్లఫోనానందం” కన్నా ఈ “నోఫోనానందం” బాగుంది.  అలా అని అసలు కమ్యూనికేషన్ లేని లైఫ్ కూడా చాలా విసుగ్గా ఉంటుంది. అందుకే ఈ మధ్యే ఫోన్ వాడటం పూర్తిగా తగ్గిన్చాను. వీలయినంతవరకు అది ఒకటి ఉన్నది అనే విషయం కూడా మర్చిపోటానికి ప్రయత్నిస్తున్నాను. కొంచెం సమయం పట్టవచ్చు. కొన్ని ఇబ్బందులు తప్పక పొవచ్చు. సరదాగా అమ్మ నాన్న కి, మా బాబాయ్ కి 25 పైసల పోస్ట్ కార్డు రాస్తున్నాను. నా వంతు గా నిర్జీవమవుతున్న పోస్టల్ శాఖకు సహాయం చేస్తున్నాను. మీరు కొంచెం తోడ్పాటు ఇవ్వండి… ఎలాగు లవ్ లెటర్స్ రాసిన అలవాటు, అనుభవం ఉంటుంది కదా!!     లేకపోయినా ఫర్వాలేదు, డాష్ అని అనిపించుకోవటం కంటే ఉత్తరాలు రాయటం మేలు…   .ఆఖరి మాట ఉత్తరాలు కేవలం తెలుగు లోనే రాయండి.
ఏది ఏమయినా, ప్రస్తుతానికి నా మొబైల్ కాలర్ ట్యూన్ మాత్రం … ఈ నంబరు తాత్కాలికముగా పని చెయ్యటం లేదు.
*కట్నం ఒక దురాచారం, దయచేసి ప్రోచ్చహించకండి
ఈ నంబరు తాత్కాలికముగా పని చేయుటలేదు
నా చిన్నప్పుడు (అంటె 4-5 సంవస్తరాల వయస్సు అప్పుడు) ప్రభుత్వం వారు మా ఊరికి కొత్తగా ఫోన్ లైన్ వేశారు. మొత్తం 4 లైన్ లు. మా నాన్న గారు వ్యవసాయం తో పాటు ఎరువుల, పురుగు మందుల షాప్ ఒకటి నడిపే వారు. ఏజెంట్ ల తో, కంపెని వాళ్ళతో మాట్లాడవచ్చు అని ఇంట్లో ఫోన్ ఏర్పాటు చేయించారు. మిగిలిన 3 ఫోన్ కనెక్షన్లలో పంచాయతి ఆఫీసు లో ఒకటి, ఇంకొక రెండు నాకు తెలియదు మరి ఎవరు ఇంట్లో ఉండేవో. మా ఇంట్లో ఉంది అది చాలు నాకు, ఆ విషయం నేను స్కూల్ లో నా ఫ్రెండ్స్ అందరికి రోజు చెప్పుకోవటానికి. అదొక గ్రేట్ ఫీలింగ్ అండి బాబు . (భోగి పండుగ రోజు క్లాసు పుస్తకాలు అన్ని భోగి మంటలో వేసినంత ఆనందం[ముఖ్యంగా లెక్కల పుస్తకం] లేదా స్కూల్ వాళ్లు పిక్ నిక్ కి తీసుకొని వెళ్ళినప్పుడు అందరి దగ్గర డబ్బులు అయిపోయిన తరువాత నా జేబు లొ ఉన్న 50 పైసలు తీసి ఒక ‘గీతా’ ఆరంజి ఐస్ క్రీమ్ కొనుక్కొని  తింటుంటే , ఒకడు వచ్చి నాకు పెట్టరా అని అడిగి, నేను పెట్టను అని చెప్పినప్పుడు కలిగే ఫీలింగ్ లాంటిది; ఆ తరువాత ఇద్దరం కొట్టుకొని, ఐస్ క్రీమ్ క్రింద పడిపోతుంది; అదే వేరే విషయం అనుకోండి. కాని ఆ ఫీలింగ్ మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్)
ఫోన్ అయితే వచ్చింది కాని ఇంట్లో ఒక గొడవ రోజూ.. అది మోగితే ఆలస్యం బాత్ రూమ్ లో ఉన్నాను అని కూడా చూడకుండా ఉరుక్కుంటూ వచ్చే వాడిని అదే అవతారం తో. ఫోన్ ఏత్తి ‘హలో నేను .. మీరు ఎవరూ’ అనే వాడిని .. ‘నువ్వు అంటే ఎవరు’ అని అడిగితే .. ‘మీరు ఎవరో ముందు చెప్పండి’ అని టైం పాస్ చేసే వాడిని. 2వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం లొ చేరాను, అప్పటి నుంచి “హలో , దిస్ ఈజ్ ఐ యాం టాకింగ్, ఎ బి సి డి , హు ఈజ్ టాకింగ్”  అని నాకు వచ్చిన 2వ తరగతి ఇంగ్లీష్ అంతా మాట్లాడే వాడిని. ఈలోపులో మా నాన్న గారు లేదా అమ్మ వచ్చి నెత్తి మీద రెండు మొట్టికాయలు వేసి నేను మాట్లాడే అవకాసం కొట్టేసింది కాక అలా స్నానం మధ్యలో వచ్చి ఇల్లు అంతా తడి తడి చేసినందుకు రెండు విమానాలను వీపు నా మీద నుంచి టేక్ఆఫ్ చేయించే వారు.
ఆయినా నేను మారక పోయే సరికి ఫోన్ ను అటక మీద పెట్టారు . నేనేమో ఇక ఫోన్ వస్తే చాలు ఎలాగు అటక మీద ఉన్న ఫోన్ అందుకోలేను కనుక అక్కడే నిలబడి ‘ఫోన్ వచ్చింది .. ఫోన్ వచ్చింది’ అని ఫోన్ రింగ్ కంటే గట్టిగా అరిచే వాడిని. అదొక ‘పిల్లఫోనానందం’ .
ఫోన్ కనిపెట్టిన గ్రాహం బెల్ కి దాని మీద ఎంత అభిమానం ఉందొ నాకు తెలియదు కాని, నేనే ఫోన్ అయిపోయినట్టు లేదా నాకు కూడా ఒక ఫోన్ ఉన్నట్టు,అందరు ఎప్పడూ దానికే కాల్ చేసినట్లు కల వచ్చేది. దురదృష్టం!!  తరువాత ఒక్క ఏడాదికే మా నాన్న గారు ఫోన్ కనెక్షన్ తీసేయించారు.మా ఊరిలో వారికి అది ఒక చిన్న పాటి బిల్ కట్టే అవసరం లేని STD బూత్[ట్రంక్ కాల్ సౌకర్యం కూడా కలదు] లాగా మారిపోయింది. పైగా నెలకి కేవలం 10-15 రోజులు మాత్రమే పని చేసేది. లైన్ ప్రాబ్లం అని చెప్పేవాడు లైన్ మ్యాన్ ప్రతీ సారి. ఇన్ని ప్రొబ్లెంస్ తొపాటు ఇంట్లో నా ‘పిల్లఫోనానందం’ ప్రాబ్లం కూడా ఒకే సారి పోతుంది అని అలా చేశారు… ఆ బాధ ని తట్టుకోలేక నేను ఇక ఫోన్ జోలికి వెళ్ళకూడదు అని మా ఊరిలో దొరికే గులక రాయి అంత గట్టిగా నిర్ణయించుకున్నాను. [మా ఊరు గులక రాళ్ళకు బాగా ప్రసిద్ది.]
మళ్ళి నేను ఇంటర్ లో ఉన్నపుడు దసరా ఆఫర్ అని BSNL వారు ఇచ్చిన ప్రకటన  చూసేసరికి ఒక కొత్త ఫోన్ గంట నా చెవులో మోగింది. మరి నా గులకరాయి శభదం ?
ఏమి చెయ్యాలి!!? ఏమి చెయ్యాలి!!? అని తెగ ఆలోచించాను. అద్దం ముందు నిలుచున్నప్పుడు “ప్రశాంతంగా ఉన్న సీమలోకి అశాంతిని తీసుకు రావద్దు” ఆని నా అంతరాత్మ శనివారం వేసుకునే వైట్ డ్రెస్ లొ వచ్చి చెప్పింది.[ actual గా నేను ఆ వైట్ డ్రెస్ కోసం సంస్కారవంతమైన XXX సబ్బు వాడతాను].అలా అంతరాత్మ తో టోల్ ఫ్రీ లైన్ లొ మాట్లాడుతుండగా; చిన్నప్పుడు ఒకే పిప్పెర్మేంట్ బిళ్ళ చేతిలో ఉంటే అది నా చీమిడిముక్కు గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వాలా, లేదా నా నల్ల గుండు బెస్ట్ ఫ్రెండ్ కి ఇవ్వాలా అని ఆలోచించిన సీన్ నా కళ్ళముందు కదిలింది… చివరికి ఒక నిర్ణయానికి వచ్చాను. ఇంటి ముందు అమ్మ వేసే ముగ్గు పిండి లొ గులక రాయిని కలిపేసి, XXX బదులు Ita[ఇట] సబ్బు తెచ్చి, ఫోన్ రాక కోసం అమ్మని పెద్దముగ్గు వెయ్యమని బ్రతిమలాడి ఆ ముగ్గులో తోట రాముడి అవతారం దాల్చి పొరుగింట్లో నుంచి తస్కరించి తెచ్చిన రెండు గులాబి పూలు పేర్చి [అనగా పూలతో స్వాగతం అనమాట]   ఫోన్ ను నట్టింట్లోకి, నా శభదం ని వాకిట్లోకి పంపించేశాను.
అనుకోకుండా ఈసారి నాకు నా తమ్ముడితో పోటి వచ్చి పడింది . ఫోన్ మోగితే నేను అంటే నేను అని ఇద్దరం కాల్ రిసీవ్ చేసుకోవటానికి గొడవ పడేది. ఒక పక్క ఫోన్ మోగుతుంటే నేను వాడు కింద మీద పది కొట్టుకుంటే ఉండేవాళ్ళం . ఎవరూ గెలిస్తే వాళ్ళు ఫోన్ ఎత్తాలి [అని ఇద్దరం ఒక బోర్డర్ అగ్రీమెంట్ మీద సంతకాలు చేశాము ]. చాలా సార్లు ఫోన్ రింగ్ ఆగిపోవటం లేదా పెద్దవాళ్ళు ఏవరో ఒకరు వచ్చి ఎత్తటం జరిగేది. తరువాత మొత్తం రెండు రన్వేల మీద నాలుగు విమానాలు టేక్ ఆఫ్ అయ్యేవి.
అలా విమానాలు టేక్ ఆఫ్ తో, కొట్టుకుంటుండగా తగిలిన దెబ్బల తో సాగుతున్న నా లైఫ్ లోకి మొబైల్ ఫోన్ రింగ్ వినిపించింది. “నువ్వు చాలా మంచి అమ్మవి, అసలు నీ లాంటి అమ్మ ఉండనే ఉండదు” అని జగమెరిగిన సత్యం ను మళ్ళి మళ్ళి చెప్పి మా అమ్మని ప్రసన్నం చేసుకోని [ నిజం చెప్పలంటే 'విసిగించి' ], తను సంపాదించే రూ.4500/- లొ 3800/- తో నాకు ఒక ఫోన్, అందులోకి బ్యాలన్స్ సింగల్ వరం లొ కొట్టెశాను .
కోతికి కొబ్బరికాయ దొరికితే ఏమి చేసిందో నాకు తెలియదు కాని, నా దగ్గర ఫోన్ ఉంది అని సంతోష పడటం , దాని మీద ఈగవాలిన సరే ఆ ఈగని చంపేయటం, అవసరం ఉన్నా లేకున్నా ట్రింగ్ ట్రింగ్ అనిపించటం, బ్యాటరీ లొ ఒక్క ఫుల్ల కూడా తగ్గకుండా ౨౪ గంటలు చార్జింగ్ పెట్టటం నిత్య దిన చర్యా భాగం అయిపోయింది. ఫోన్ అయితె వచ్చింది కాని మరి నాకు ఎవరూ కాల్ చెయ్యటం లేదు అని తెగ బాద పడేది. నేనే ఏదో ఒక వేరే నెంబర్ నుంచి నా ఫోన్ కు కాల్ చేసి .. ఫోన్ మోగింది అని సంతోష పడేది. ఈ మేటర్ లొ నా  బావమరిది దిలీప్ నాకు బాగా సహాయం చేసేవాడు. లేదా ఎవరికో ఒకరికి ఒక మిస్ కాల్ ఇస్తే, వాళ్ళే ఫోన్ చేసేవారు.. “ఎవరిదండి ఈ నెంబర్, మాకు ఒక మిస్ కాల్ వచ్చింది” అని అనుకుంటూ.. “క్షమించండి, రాంగ్ నెంబర్ డయల్ చేశాము,, అందుకని కట్ చేసేశాను” అని ఒక సమాధానం చెప్పి పెట్టేసేది.
నా బావమరిది దీపు గాడు కాల్ సెంటర్ కి క్రమం తప్పుకుండా కాల్ చేసే వాడు. “హలో!! దిస్ ఈజ్ mr.respectable దిలీప్ స్పీకింగ్ , హు ఈజ్ ఆన్ ది లైన్” అని మాట్లాడేది. ఎయిర్ టెల్ వాడు కాల్ సెంటర్ కి నెలకి 5 సార్లు మాత్రమే కాల్ చేసే సౌకర్యం ఏర్పాటు చేసిన తరువాత ఆ కాల్ సెంటర్ నెంబర్ ని చాలా చాలా జాగ్రతగా ఉపయోగించుకునే వాళ్ళం. కేవలం అమ్మాయిలు ఫోన్ ఎత్తితేనే సమాధానం చెప్పేది.లేకపోతే నా ఫోన్ బ్యాటరీ లొ ఎంత ఛార్జ్ ఉందొ చెప్పుకోండి చూద్దాం అని “పట్టుకుంటే పట్టుచీర”  ప్రోగ్రాం లొ లాగా తిక్క ప్రశ్న అడిగి, వెంటనే లైన్ కట్ చేసేది. అదొక ‘పిల్లఫోనానందం’ .
నోట్ బుక్ లొ అందరు పేరు క్రింద చదివే డిగ్రీ లేదా సెమిస్టర్ రాసుకుంటారు, నేను మాత్రం వాటితో పాటు నా మొబైల్ నెంబర్ కూడా రాసుకునేది. నా పుస్తకాలు సరిపోక, వేరే వాళ్ళ దాంట్లో రాస్తే నెంబర్ ని అడ్డంగా కొట్టేస్తున్నారు అని లైబ్రరీ కి వెళ్లి అక్కడ బుక్స్ లొ కూడా వ్రాసి వచ్చేది. సేఫ్ సైడ్ కింద 10 అంకెల్లో ఏదో ఒక అంకె మిస్ చేసి రాసేది. పనిలో పనిగా.. ఎవరి మీదన్నాకోపం ఉంటే వాళ్ల పూర్తి నెంబర్ వ్రాసేది. లైబ్రేరియన్ వాళ్ళకి కాల్ చేసి , తిట్టి , ఫైన్ కట్టిస్తే ఆ శుభసంధర్భం లొ ఒక సారి మళ్ళి కాల్ సెంటర్ కి ఫోన్ చేసే వాళ్ళం.
ఇంకా ఉంది …
బావ నీకు హిందీ వచ్చా?
అంతా సవ్యంగా సాగితే ఇలా ఉండేది కాదేమో…
నేను , నా బావమరిది దిలీప్ (ఇక నుంచి ‘దీపు గాడు’) ఇంట్లో వారి కోరిక మీద ( అదేనండి మొక్కులు) ఒక సారి షిరిడి వెళ్లి సాయినాధుని దర్శించుకుందామని బయలుదేరాము.మన దీపు గాడు పదవ తరుగతి పాస్ అయితే షిరిడి వస్తాము అని కోరుకున్నరంతా కలిసి. దీపు గాడికి మాత్రం షిరిడి వెళ్ళే అవసరం రాదు అని గట్టి నమ్మకం. కాని ఎక్కడో ఏదో పొరపాటు జరిగి [ దీపు కి ఈ పొరపాటుకి ఎటువంటి సంబంధం లేదు ], మేము ఈ ప్రయాణానికి ఉపక్రమించవలసి వచ్చింది.
షిరిడి అంటే మహారాష్ట్ర వెళ్ళాలి.దీపు గాడు గట్టిగా ఇటు హైదరాబాద్ , అటు ఒరిస్సా ,మళ్ళి ఇటు తిరుపతి మించి పెద్దగా భారతదేశం కొలతలు వెయ్యలేదు. మహారాష్ట్ర అంటే బొంబాయి లో ఉంది కదా బావ? అని నన్ను బయలుదేరేముందు అడిగాడు.నేను వాడి సోషల్ మార్క్స్ చూసి వాడు అడిగిన దాంట్లో తప్పులేదు అని అనిపించింది. సోషల్ లో హీరో గారికి ౩౬ వచాయి.
వాడికి తోడుగా కొంచెం హిందీ బాగా తెలిసిన వాడిని(దూరదర్శన్ చూసి నేర్చుకున్నాను అండి. మా చదువులు పాడు అవుతాయి అని మా ఇంట్లో కేబుల్ టివి కనెక్షన్ పెట్టించలేదు!!)  అని ఇద్దరికీ కలిపి ౨ వేల రూపాయలు ఇచ్చి ,సికంద్రాబాద్ లో సాయంత్రం ౫ కి ట్రైన్ ఒకటి ఉంది అని చెప్పి వెళ్ళమన్నారు. ఖమ్మం నుంచి ౧ కి ట్రైన్ ఎక్కాము. వరంగల్ వరకు బాగానే వెళ్ళింది. తరువాత నుంచి ఏండ్ల బండి అయ్యింది. సరే అలానే బండి లాగించి , ట్రైన్ లో దీపు గాడు అడిగే ప్రశ్నలకి సమాధానం చెపుతూ సికంద్రాబాద్ చేరే సరికి ౬ అయింది. షిరిడి ట్రైన్ కి దీపు గాడు వస్తున్నాడు అని తెలియక వెళ్లి పోయింది !! పోనిలే బావ మొదటి సారి కదా క్షమించేశాను అని అన్నాడు.
ఇమ్లిబన్ కి వెళ్తే అక్కడ నుంచి కూడా షిరిడి వెళ్ళే బస్ లు వెళ్ళిపోయాయి అన్నారు. ఇక చేసేది ఏమి లేక అఫ్జల్ గంజ్ వెళ్లి ‘షిరిడి’ అని బోర్డు పెట్టిన ఒక ట్రావెల్స్ వాడిని అడిగితే వాడు ఇదే మంచి ఛాన్స్ అని షిర్డీ డైరెక్ట్ బస్ లేదు, పూణే లేదా బొంబాయి వెళ్ళండి, అక్కడి నుంచి షిరిడి కి చాలా బస్ లు ఉంటాయి చెప్పి ౪౦౦ టికెట్ కొట్టి ౮ కి బస్ అని చెప్పి ౧౧.౩౦ కి ఎక్కించాడు.
ఉదయం ౫.౩౦ కి బస్ ఆగితే డ్రైవర్ ని వెళ్లి మన దీపు గాడు అడిగాడు, బొంబాయి ఇంకా ఎంత దూరం, మేము చాలా అర్జెంటు గా షిరిడి వెళ్ళాలి అని..డ్రైవర్ కింద నుంచి పై దాగ చూసి ఇద్దరినీ … షిరిడి వెళ్ళాలంటే బొంబాయి వరకు ఎందుకురా ఆక్కుపక్షి ‘తెమ్బుర్ని’ లో దిగి వెళ్ళు, త్వరగా వెళ్తావు అని మార్గ నిర్దేశం చేసాడు.
అలాగే దిగాము.వాడు చెప్పినట్లు బస్ అయితే ఏమి రాలేదు.సరే తెల్లారింది కదా అని ప్రకృతి ని సమాధాన పరిచి బస్ కోసం చూస్తున్నాము.నేను వెళ్లి హోటల్ లో ౨ ప్లేట్ పూరి ఆర్డర్ చేసేలోపు దీపు గాడు మాయం అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడు అని నేను చూస్తుంటే దూరంగా ఉన్న టాక్సీ స్టాండ్ లో ఎవరో టాక్సీ డ్రైవర్ తో సీరియస్ గా మాట్లాడుతున్నాడు. కొంచం పరికించి చూస్తె మాట్లాడటం లేదు అని కన్ఫాం అయ్యాను. ఆదివారం వచ్చే మూగ, చెవిటి వాళ్ల వార్తలు లాగ ఉంది మొత్తం సీన్.
దీపు గాడి నోట్లోనుంచే ఒకటే మాట “మై షిరిడి గో .. బస్ కబ్ కం ? షిరిడి రూట్ విచ్ రోడ్ ?”( mai shiridi go … bus kab come ? shiridi route which road?) నాకు మ్యాటర్ అర్ధం అయ్యి అక్కడ ఉన్నవాలని హిందీ లో అడిగాను.అదే విషయం వాళు వివరంగా చెప్పారు. దీపు గాడు థాంక్స్ అని వాళ్ళని చూసి ఒక నవ్వు నవ్వి , నన్ను పక్కకి లాగి “ఏంటి బావ నీకు హిందీ వచ్చా?” అని దీర్ఘం తీశాడు.   ఇచ్చాను. హమ్మయ్య !! బతికించావు బావ. నీకు కూడా హిందీ రాదు ఏమో !! మన ఇద్దరినీ నేను ఎలా షిరిడి అంతా జాగ్రతగా చూపించి మళ్ళి ఇంటికి తీసుకొని వెళ్ళాలా అని భయపడ్డాను అని నాకు ఒక చిన్న షాక్ ఇచ్చాడు.
షిరిడి వెళ్ళే బస్ వచ్చింది. బస్ లో దీపు గాడు నా వెనుక సీట్ లో ఉన్నాడు. పక్కన ఉన్న అతను ఏదో అడిగాడు . వీడికి అర్ధం కాలేదు .. నన్ను వెంటనే అడిగాడు “నాకు హిందీ కొంచం మాత్రమే వచ్చు” అని ఎలా అంటారు హిందీ లో అని. “ముజ్హే హిందీ సిర్ఫ్ తోడా తోడా ఆతా హై” ఆని అంటారు ర ఆని చెప్పను. ఓసి అంతేనా , నువ్వు ఇలా నాకు మధ్య మధ్యలో తోడా తోడా హిందీ అందిస్తే చాలు బావ..  తోడ కొట్టి మరి మాట్లాడేస్తాను ఆని ఇక సీరియస్ గా వాడితో ఎవరన్నా మాట్లాడతారేమో ఆని చూస్తున్నాడు. పక్కన వాడు మళ్ళి కదిలించాడు వీడిని ; టైం బాగోక ( ఎవరిదో నాకు తెలియదు …)
౫ నిముషాలు తరువాత మళ్ళి దీపు కి ఇంకొక అనుమానం వచ్చింది. బావ ‘తోడా’ అంటే కొంచెం .. మరి ఎక్కువకి ఏమని అనాలి బావ ఆని అడిగాడు .. “బహుత్”  అంటారు రా అన్నాను.
ఈ ‘కొంచెం’, ‘ఎక్కువ’ లోనే వాళు ఇద్దరు చాలా మాట్లడేసుకున్నారు. మొత్తానికి కష్టపడి , బస్ లో పడి, దీపు గాడి డౌట్ ల తో కింద మీద పడి షిరిడి చేరుకున్నాము.
దర్సనం కోసం వెళ్తున్నాము. దారిలో కొబ్బరికాయల కొట్టు వాడు ఆపి , తన దగ్గర పూజ సామగ్రి కొంటె దర్సనానికి దగ్గరి దారి చెప్తాను ఆని అన్నాడు. దీపు గాడి చిన్న బల్బు వెలిగి ‘సరే’ ఆని అన్నాడు. సామాను తీసుకొన్నాము . దారి కనుక్కొని ‘అయ్యో సారీ మా దగ్గర డబ్బులు లేవు.. వద్దులే.. నీ దగ్గరే ఉంచుకో’ ఆని నన్ను రమ్మని ముందుకు వెళ్ళిపోయాడు.
షాప్ వాడు కిందకి మీదకి రెండు సార్లు చూసి ఏదో అన్నాడు. నాకు అర్ధం కాలేదు. అన్నది మరాఠీ లో కదా. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది.. హిందీ అంటే మనం మేనేజ్ చెయ్యగలం.. మరాఠీ సంగతి ఏమిటా ఆని … ఆలస్యం చెయ్యకుండా దర్సనం చేసుకొని తిరిగి బయలుదేరాలి ఆని నిర్ణయించుకొని దీపు గాడిని ఫాలో అయ్యాను గుడి లోకి.
దర్సనం షాప్ వాడు చెప్పినట్లే ౨౦ నిముషాల్లో అయిపొయింది. శుభం .. ఇక పదరా దీపు ఇంటికి వెళ్ళిపోదాం ఆని అన్నాను ( నా మరాఠీ బాధ నాది ) .. ఏంటి బావ నువ్వు .. ఇంత దూరం వచ్చింది.. కేవలం ఈ అర్ధ గంట కోసమా? మనం పరిసర ప్రాంతాలంతా చెక్ చేసి వెళ్దాము ఆని డిసైడ్ చేసాడు.. ఈ రోజుకి శని దేవాలయం చూసి వచ్చి , రేపు ఎల్లోరా, ఔరంగాబాద్  చూసి అక్కడి నుంచే ట్రైన్ ఎక్కుదామని డిసైడ్ అయ్యాము.
శని దేవాలయం చూసి వచ్చెశాము. తెల్లారి ఔరంగాబాద్ బయలుదేరాము. ౯ టాటా సుమోలు వరసగా వెళ్తున్నాయి. అందరు టూరిస్ట్ లే. మేము రెండవ దానిలో ఫ్రంట్ సీట్. దీపు గాడికి ఈ సీన్ మొత్తం చూసేసరికి రాయలసీమ ఫాక్షన్ సీన్ గుర్తుకు వచ్చింది. వాడి దగ్గర ఉన్న ఒక చిన్న పెన్ నైఫ్ తీసి బయటకు పెట్టి తిప్పుతున్నాడు.. ఏమిటిరా అది అన్నాను. నీకు బొత్తిగా సినిమా జ్ఞానం లేదు బావ ఆని ఒక సర్టిఫికేట్ ఇచేసి సీన్ ఎక్ష్ప్లైన్ చేసాడు.
సాయంత్రానికి ఔరంగాబాద్ చేరుకున్నాము.  సూమో వాడు ఊరి బయట దించేసి స్టేషన్ కి ఆటో లో వెళ్ళండి సర్, మేము ఊరి లోకి రాకోడదు ఆని చెప్పేశాడు. ఆటో ఎక్కి కూర్చున్నాము స్టేషన్ కి పదమని . మీటర్ గిర్రున ఆటో టైర్ కంటే స్పీడ్ గా తిరుగుతున్నది. అఫ్జల్ గంజ్ లో బస్ వాడు చేసి మోసని మేము ఆర్దిక మాంద్యం లో ఉన్నాం. స్టేషన్ కనుచూపు మేర లో కనిపిస్తే ఆటో దిగిపోయి నడుచుకుంటే వెళ్దామని బిర్లా సిమెంట్ తో కట్టిన గోడలా గట్టిగా డిసైడ్ అయ్యాము.
మళ్ళి దీపు గాడికి ఒక ఐడియా వచ్చింది. నేను కుదరదు అన్నాను. ‘ట్రై అండ్ ట్రై’ అన్నారు బావ పెద్దలు ఆని నాకు గీతోపదేశం చేశాడు ఆటో లో. సరే ఆని నేను ఆటో వాడితో ఏదో సొల్లు కబుర్లు వేస్తున్నాను హిందీ లో . దీపు గాడు మీటర్ వైర్ ని తిరగ కుండ గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు ఇంకొక వైపు. అది వర్క్ ఔట్ అయిందో లేదు తెలియదు కాని నాకు స్టేషన్ కనిపించింది. వెంటనే ఆటో దిగిపోయి ౩౬ రూపాయలు కట్టి స్టేషన్ వైపు వెళ్తున్నాము. చూడటానికి దగ్గరగా ఉంది.. కాని వెళ్తుంటే తెలిసింది చాలా దూరం ఆని. దీపు గాడు పర్వాలేదు బావ మన బెజవాడ ఒక్కటే బాగుంటుంది చూడటానికి ఆని అనుకున్నా ఔరంగాబాద్ కూడా బాగానే కట్టారు ఆని ఒక చిన్న మెచ్చుకోలు పడేసి అటు ఇటు చూస్తూ స్టేషన్ లో అడుగు పెట్టాము.
షిరిడి వెళ్ళే దారిలో ట్రాక్ చెడిపోయింది ట్రైన్ ఔరంగాబాద్ నుంచే బయలు దేరుతుంది ఆని అన్నౌన్సుమేంట్ వినేసరికి నిన్న దీపు గాడు చెప్పిన మాట వినటం వల్ల ఎంత కలిసి వచ్చింది ఆని ఆనందపడి వాడిని ప్లాట్ఫారం మీద ఉండమని నేను తినటానికి ఏమన్నా తెద్దామని వెళ్ళాను.
నేను వచ్చేసరికి దీపు గాడు మళ్ళి సీరియస్ గా ఎవరితోనో మాటామంతి సాగిస్తున్నాడు. దగ్గరికి వెళ్లి వింటే “ముజ్హే హిందీ బహుత్ బహుత్ ఆతా .. మై బావ ఆతా” అని అంటున్నాడు.
అవతలి వాడికి ఏమి అర్ధం కావటం లేదు. సీన్ లోకి ఎంటర్ అయ్యి వాడికి కాలసిన విషయం చెప్పి పంపించేశాను. నేను తెచ్చిన అరటి కాయలు తింటున్న మన వాడి వైపు తిరిగి అడిగాను వాడికి ఏమని చెప్తున్నావురా ? అని
“నాకు హిందీ కొంచెం కొంచెం మాత్రమే వచ్చు .. మా బావ వస్తాడు ఆగు” ఆని. బహుత్ బహుత్ అంటే ఎకువ అని అర్ధం రా.. కొంచెం అని కాదు అని అన్నాను.. ఏదోలే బావ.. ఇంజన్ డ్రైవర్ ని అడుగు ట్రైన్ ఎన్నిటికి బయలు దేరుతుందో.. వీలయితే షార్ట్ కట్ లో త్వరగా హైదరాబాద్ వెళ్ళమని చెప్పు.. నా హిందీ వాడికి అర్ధం కాక ఇంకెక్కడి కన్నా వేల్తాడెమో అని అరటికాయ తింటూ ఒక ఆర్డర్ పడేసాడు అరటి తొక్క తో పాటు.
క్షణం ఆలస్యం చెయ్యకుండా విచారణ కేంద్రం లో కనుక్కోని ఇంకొక రెండు గంటల్లో బయలుదేరే హైదరాబాద్ ట్రైన్ లో వాడు నేను ఎక్కి కూర్చున్నాము ‘జై సాయి రాం’ అనుకోని .
కొంత సైన్స్
ఈ పద్దతి చాలా బాగుంది .
ఎటో వెళ్ళి పోతూ..నిన్ను చూసింది అనుకో ఓ ట్రబులు…
మొన్న సికింద్రాబాద్ నుంచి బెంగుళూరు వచ్చాను.. నా అదృష్టం ఎంత బాగుంది అని అడిగితె … తక్కువ రేట్ లో AC ట్రైన్ లో ప్రయాణం అని అంటే సంబరపడి ‘గరీబ్ రథ్ ఎక్ష్ప్రెస్’ టికట్టు సంపాదించి బయలుదేరాను .. గంట ప్రయాణం బాగానే సాగింది .. తరువాత AC ఆగిపోయింది .. చెమట ఉకపోత మొదలు .. ౨ గంటలు ఇబ్బంది తరువాత బాగుచేశారు.. మళ్ళి చల్లబడ్డాము అందరం..
నాకు అమృతం పాట గుర్తుకువచ్చింది…
ఎటో వెళ్ళి పోతూ..నిన్ను చూసింది అనుకో ఓ ట్రబులు..
hello..how do u do.. అని అంటోంది అంతే నీ లెవెలు.
ఆతిధ్యం ఇస్తానంటె మాత్రం వస్తుందా…
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా…